Weaving stories from the soul of India

Poet • Storyteller • Cultural Ambassador

Harini Sridhar — Telugu Poet & Storyteller

నా పరిచయం

Harini Sridhar writing Telugu poetry

నానమ్మ తాతగారు కీ.శే శ్రీ దుద్యాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి సుందరమ్మ గారు మరియు అమ్మమ తాతగారు శ్రీ జనమంచి రామసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి రాధమ్మ గారి పాద పద్మములను స్మరించుకుంటూ నమః స్సుమాంజలులు.
నేను హైదరాబాదు లో జన్మించి మా నాన్న గారి స్వస్థల మైన మదనపల్లె పట్టణమందు విద్యాబుద్ధులు నేర్చకున్నాను. ఆ తరువాత ఉన్నత విద్యలను హైదరాబాదు లో అభ్యసించి NTR యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో పట్టభద్రురాలి నయ్యాను. మానవ సేవే మాధవ సేవ యని తలచి వైద్య వృత్తి నెంచుకున్నాను.
మొదటినుంచి నాకు పెయింటింగ్ పెన్సిల్ స్కెచెస్ వేయడం చాల ఇష్టం అలాగే కథలు కవితలు వ్రాయడం కూడా చాలా ఇష్టమైనవె, ఈ మద్యనే పద్య రచన మిద సాదన చేసి అమ్మవారి కృపతో ఈ శతకాన్ని పూర్తి చేశాను.
నాకు హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీనివాస శ్రీధర్ తో వివాహం జరిగినది, మా వారు సాఫ్టు వేరు రంగములో పని చేస్తున్నారు మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి కార్తిక్ రామ్, అమ్మాయి దుర్గ శర్వాణి.
నాకు ఇద్దరు తోబుట్టువులు అక్కయ్య హిమబిందు మరియు అన్నయ్య మంజునాథ్. ఇంటి లో అందరికన్నా చిన్నదాన్ని కావటం వలన నాకు వారి ప్రేమ సహాయ సహకారములను నిత్యం అందిస్తూ నా వెన్నంటే ఉంటారు.
నా పద్య రచనకు తమ వంతు సహాయ సహకారముల నందిస్తూ నిరంతరం నన్ను ప్రోత్స హించిన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నాను.

-హరిణి శ్రీధర్

Record certificate — First Telugu Shatakam Writer in Haryana

First Telugu Shatakam Writer in Haryana

Awarded by

Shri. Relangi Narsimha Rao Indian film director and screenwriter
Record certificate — Telugu literature achievement
Women's Day award for contributions to Telugu literature

Award on Women's day
Recognizing efforts towards telugu literature

శతకములు

Book cover — శ్రీ శర్వా శతకము

శ్రీ శర్వా శతకము

కందం

త్వరలో మీ ముందుకు రాబోతుంది

నమస్తే శర్వా శతకము
Book cover — శ్రీ సరస్వతీ శతకము

శ్రీ సరస్వతీ శతకము

ఉత్పలమాల, చంపకమాల , మత్తకోకిల , ధ్రువకోకిల

త్వరలో ఆవిష్కరించబడును

Read PDF
Book cover — శ్రీ చక్రధారి శతకము

శ్రీ చక్రధారి శతకము

ఆటవెలది

త్వరలో ఆవిష్కరించబడును

Read PDF
Book cover — శ్రీ లక్ష్మీ శతకము

శ్రీ లక్ష్మీ శతకము

కందం

త్వరలో ఆవిష్కరించబడును

Read PDF
Book cover — శ్రీ వేంకటేశ్వర శతకము

శ్రీ వేంకటేశ్వర శతకము

తేటగీతి

ఆవిష్కరణకి సిద్దముగా ఉంది

శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి ఆశిర్వచనముతో కూడిన శతకము.

Check Images
Images
Read PDF
Book cover — శ్రీ విశ్వనాథ శతకము

శ్రీ విశ్వనాథ శతకము

తేటగీతి

Lauched 1 year and 5 days ago

అ విశ్వనాధుడి కృపచే 10 గంటల్లో రచించబడిన శతకము మరియు శ్రీ బండారు దత్తాత్రేయు, గవర్నర్ ఆఫ్ హర్యానా గారిచే ఆవిష్కరించబడినది.
Images
Launch Event
Read PDF
Book cover — శ్రీ విఘ్నరాజ శతకము

శ్రీ విఘ్నరాజ శతకము

తేటగీతి

Lauched 1 year 5 months and 27 days ago

స్వామి వారి కృపచే 5 రోజులలో వ్రాసిన శతకము.
Launch Event
Read PDF
Book cover — శ్రీ హరిణి శతకము

శ్రీ హరిణి శతకము

ఆటవెలది

Lauched 3 years 3 months and 9 days ago

Launch Event
Read PDF
LOADING.IO

కవితలు

కథలు

Avatar

కరోనా కలిపిన జంట

Avatar

ప్రత్యక్ష దైవము - పద్య కథ

అభినందనలు.

హరిణి... మన హరిణి... చొప్పకట్ల (దుద్యాల) హరిణి శతకం రాసిందట. ఆశ్చర్యపోయాను. నా చేత్తో పట్టుకుని చూసి ఒకసారి గిల్లుకొని చూస్తే చురుక్కుమన్నప్పుడు నిజమే ...More

జమ్మలమడక శశిమోహన్
నాటక రచయిత
పల్లెసృజన పత్రిక - సంపాదకులు మరియు సంస్థకార్యవర్గసభ్యులు
సహకారశిక్షణాసంస్థ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
అనాథవిద్యార్థి గృహ గౌరవాద్యక్షులు
— జమ్మలమడక శశిమోహన్

శతక రచయిత్రి చి:సౌ: హరిణి మాకు దగ్గరి బంధువు. మా సోదరుని మనుమని భార్య మాకు మనుమరాలు. వృత్తిరీత్యా వైద్యురాలైనా ప్రవృత్తిరీత్యా కవనముపట్ల నాకర్షితురాలు ...More

ఆచార్య చొప్పకట్ల సత్యనారాయణ
`సుకవితావిశారద` బిరుదాంకితులు
ద్విభాషా కోవిదులు
డి.డి కాలనీ, హైదరాబాదు వాస్తవ్యులు
— ఆచార్య చొప్పకట్ల సత్యనారాయణ

ఇద్దరు బిడ్డలకు తల్లిగా, ఒక బాధ్యతగల సాఫ్ట్ వేర్ ఉన్నతోద్యోగియైన శ్రీ శ్రీనివాస శ్రీధర్ గారికి ఉత్తమ ఇల్లాలై, తాను స్వయంగా ఫిజియోథెరపిస్ట్ వృత్తిలో ఉన ...More

శ్రీమతి నండూరి సుందరీ నాగమణి
కథారచయిత్రి, పద్యకవయిత్రి,
విశ్రాంత బ్యాంకు అధికారిణి
హైదరాబాదు వాస్తవ్యులు
— శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

సనాతన కాలం నుండి పద్యం రాజిల్లుతూనే ఉంది. పద్యమనేది పద్య కవులకు ఒక ధృవపత్రం లాంటిది అని చెప్పవచ్చు. సాధారణంగా పద్యకవులు పుస్తకం అచ్చువేయించాలంటే 108 ప ...More

శ్రీ జక్కని గంగాధర్
కవి, రచయిత,
ముంబాయి వాస్తవ్యులు
— శ్రీ జక్కని గంగాధర్

మన భారతదేశము అనగా ఈ కర్మభూమి సర్వమంత్ర స్వరూపమై, సర్వవిద్యా సంపత్ప్రదాయకమై ఉండటం, ఇటువంటి మట్టిలో మనం జన్మించటం మన పూర్వజన్మ సృకృతం. అందుకు గానూ మనకు ...More

శ్రీ అప్పళ్ళ. సుబ్రహ్మణ్య స్వామి
యజుర్వేద స్మార్త పురోహితులు,
న్యూ డిల్లి
— శ్రీ అప్పళ్ళ. సుబ్రహ్మణ్య స్వామి

శ్రీ గణనాథునికి అంకితము చేయబడినవి రెండు పురాణములు ఒకటి 'గణేశ పురాణం', రెండు 'ముద్గల పురాణం'. కవయిత్రి ముద్గల పురాణమాధారముగా ఈ శతకములో చాలా పద్యములు రచ ...More

శ్రీ ప్రసాద్ కట్టుపల్లి
విశ్రాంత బ్యాంకు అధికారి
— శ్రీ ప్రసాద్ కట్టుపల్లి

నా కుటుంబం

నా మొదటి ప్రేక్షకులు, నా అత్యంత నిజాయితీగల విమర్శకులు మరియు నా గొప్ప మద్దతుదారులు.